స‌త్తా చూపేందుకు సిఎం రెడీ..?


ముఖ్యమంత్రి మెల్లమెల్లగా తన పవర్ ను పెంచుకుం టున్నట్లు కనబడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక.. పార్టీ నుంచే కాక.. సహచరుల నుంచి ఎన్నో రకాల దాడులను ఎదుర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు తన మార్క్ ను చూపెట్టు కోబోతున్నారు. బొత్సతో తనకు విభేదాలు లేవంటూనే.. రకరకాల ప్లాన్లతో చెక్ పెట్టేందుకు సిద్దమవు తున్నారు. తాజాగా.. ముఖ్యమంత్రి సోదరుడు.. కిషోర్ కుమార్ రెడ్డిని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డీసీసీ ) కి అధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్దమైనట్లు చెబుతున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కిషోర్ అన్ని చూసుకునే వారట. జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకునే వారట. అప్పట్లో కిషోర్ కుమార్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గానికి ఇంచార్జీగా పనిచేశారు. అప్పట్లో కిషోర్ వ్యవహరశైలిపై చాలానే ఫిర్యాదులొచ్చాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఆయన్ని డైరెక్ట్ గా జిల్లా కాంగ్రెస్ కు అధ్యక్షున్ని చేయాలని చూస్తున్నారు. కాగా కిషోర్ నియామకాన్ని పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ అనుకూలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్సా కుటింబికులదే హవా. ఆయన భార్య ఎంపీ కాగా.. అతని అనుచరగణమంతా ఏదో ఒక పదవిలో ఉన్నారు. దీంతో కిషోర్ నియామకాన్ని ఆయన కాదనలేకపోతున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కిషోర్ నియామకంపై జిల్లా నేతల స్పందన ఎలా ఉంటుందనేదే ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి, కిరణ్ కు మధ్య విభేదాలున్నాయి. మరి కిషోర్ నియామకంపై ఆయనకు నచ్చదని కూడా తెలుసు. అయినా తన సోదరుడిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సిద్దమవుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!