టి.కాంగ్రస్ ఎమ్.పిల అసలు రంగు ఇదా!

కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు కొందరి అసలు రంగు బయటపడుతోంది.  విజయవాడ ఎమ్.పి. లగడపాటి రాజగోపాల్ పై విమర్శలకు ఉత్సాహపడే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పి లు కొందరు ఇప్పుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేయబోమని అంటున్నారు. మల్కాజిగిరి ఎమ్.పి సర్వే సత్యనారాయణ గతంలో లగడపాటి రాజగోపాల్ అవుపాలు, గేదెపాలు అన్నందుకు పెద్ద వివాదం సృష్టించారు. ప్రెస్ క్లబ్ లో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు. ఆ తర్వాత రాజీ పడ్డారు అది వేరే విషయం. తెలంగాణ కోసం ఏమైనా చేస్తామని ఇంతకాల చెబుతూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ సమస్య ఒక కీలకమైన ఘట్టానికి చేరుకున్న తరుణంలో దాటవేత ప్రకటనలు చేస్తున్నారు. ఒకపక్కన హైదరాబా దులో తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావు మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద కు వెళ్లి గంటల తరబడి చర్చలు జరుపుతూ రాజీనామాలపై రాయబారం చేస్తుంటే , సర్వే సత్యనారాయణ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేస్తూ తాను ఎమ్.పి పదవికి రాజీనామా చేయబోవడం లేదని ప్రకటించారు. పైగా డిసెంబరు తొమ్మిది నాటికి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెబుతున్నారు. మరో ఎమ్.పి పొన్నం ప్రభాకర్ 14ఎఫ్ రద్దుపై ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు.తెలంగాణకు ముఖ్యమంత్రి సహకరించాలని అన్నారు. పొన్నం ప్రభాకర్ కు తెలియదా సి.ఎమ్. సహకరించేది లేనిది.ఇక తెలంగాణ అంశంలో మరో తీవ్రవాద ఎమ్.పిగా పేరొందిన మందా జగన్నాధం తమకు ఎవరు డెడ్ లైన్లు పెట్టరాదని, తాము త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. సర్వే సత్యనారాయణ మరో మాట కూడా అన్నారు. మరో సినీయర్ నాయకుడు వి.హనుమంతరావు కూడా రాజీనామాలకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు.టిఆర్ఎస్ రాజీనామాల వల్ల తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఎమ్.పి విజయశాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల రాజీనామాల కోసం కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు రాజీనామాలు చేసేలా లేరని మెదక్ ఎమ్.పి విజయశాంతి అన్నారు. రాబోయే రోజులలో కాబోయే మంత్రులుగా ఊహించికుంటున్న కొందరు, ఇతర కారణాలతో కొందరు గతంలో ఏమి చెప్పినా ఇప్పుడు మాత్రం తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఒత్తిడి పెరిగితే ఏమి చేస్తారో!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!