అటు కేంద్ర మంత్రి, ఇటు రాష్ట్ర మంత్రి.. మ‌ధ్య‌లో పోలీసులు..!



కేంద్ర‌మంత్రి జైపాల్‌రెడ్డి మేన‌కోడ‌లు డాక్ట‌ర్ కిర‌ణ్‌రెడ్డి హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది.. ఆమె భ‌ర్త చైత‌న్య రెడ్డే ఈ హ‌త్య చేసాడ‌ని రుజువ‌యింది.. మొత్తానికి ఓ హ‌త్య మిస్ట‌రీ ఛేధించామ‌ని పోలీసులు ఊపిరి తీసుకునే లోపులోనే మ‌రో మిస్ట‌రీ క్రియేట‌యి కూర్చుంది.. కారంణం హ‌త్య కి గుర‌యిన మ‌హిళ కేంద్ర‌మంత్రి జైపాల్‌రెడ్డి స్వ‌యానా మేన‌కోడ‌ల‌యితే, హ‌త్యకి పాల్ప‌డ్డ‌వాడు రాష్ట్ర‌మంత్రి డి.కె. అరుణ ద‌గ్గ‌ర బంధువు.. ఇప్పుడు మొద‌ల‌యింది అస‌లు క‌థ‌.. అటు జైపాల్‌రెడ్డి హ‌త్య చేసిన‌వాడిని క‌ఠినంగా శిక్షిం చాల‌ని ప‌ట్టుప‌డుతుంటే.. ఇటు డి.కె. అరుణ హ‌త్య చేసిన‌వాడికి స‌పోర్ట్‌గా నిలుస్తుంది.. ఇరువురూ క‌లిసి చ‌ర్చించి ఈ వివాదాన్ని ప‌రిష్క‌రిద్దామ‌ని ఆమె సూచించింది.. ఈ విష‌యంపై మాట్లాడేందుకు స్వ‌యంగా జైపాల్‌రెడ్డితోనే సంప్ర‌దింపులు జ‌రిపింది.. కానీ.. జైపాల్‌రెడ్డి ఇందుకు స‌సేమిరా అన‌డంతో డి.కె. అరుణ చాలా సీరియ‌స్‌గా వెళ్ళిపోయింది.. ఇద్ద‌రు మంత్రుల వ్య‌క్తుల‌కి సంబంధించిన ఈ కేసు ఇప్పుడు పోలీసుల‌కు పెను స‌వాల్‌గా మారింది.. ఏ చ‌ర్య‌లు తీసుకుంటే ఎక్క‌డి నుండి ఏ ఉప‌ద్ర‌వం ముంచుకొస్తుందో అని పోలీసులు భ‌య‌పడుతున్నారు.. మ‌రోవైపు జైపాల్‌రెడ్డి రాష్ట్ర డిజిపికి స్ప‌ష్టంగా చెప్పారు.. ఈ కేసుని ఎట్టిప‌రిస్థితిలో నీరుకార్చ‌వ‌ద్ద‌ని.. అలాగే డి.కె. అరుణ కూడా త‌న‌వంతు పైర‌వీలు ప్రారంభించింద‌ని.. నిందితుడిని ర‌క్షించ‌డానికి తీవ్రంగా కృషి చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.. సాక్ష్యాధారాల‌ను బ‌ట్టి కిర‌ణ్‌రెడ్డిని చైత‌న్య‌రెడ్డి హ‌త్య చేసాడ‌ని ఋజువ‌యింది.. లెక్క‌ప్ర‌కారం  చైత‌న్య‌రెడ్డికి శిక్ష‌ప‌డాలి.. ఈ వ్య‌వ‌హారంలో పోలీసులు ఎటువైపు మొగ్గ‌కుండా పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.. అయినా కానీ.. ఇద్ద‌రు హేమాహేమీల మ‌ధ్య చిక్కుకుపోయిన ఈ కేసు చివ‌రికి ఎటువైపు మొగ్గు చూపుతుందో.. వేచి చూడాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!