ఫలించని కెసిఆర్ రాయబారం..!

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఐదు గంటల సేపు చర్చలు జరిపినా అవి ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికిప్పుడు చెప్పేది లేదని కెసిఆర్ ఆ తర్వాత మీడియాతో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు.దీంతో చర్చలలో ఒక అవగాహనకు రాలేకపోయారేమో నన్న భావన కలుగుతుంది. ప్రధానంగా కెసిఆర్ కాంగ్రెస్ నేతల రాజీనామల కోసం పట్టుబట్టినా దానిపై కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కేశవరావు, సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు తమ బాధలు చెప్పినట్లు కనిపిస్తుంది. తప్ప నేరుగా రాజీనామా చేయడానికి ఇంకా సిద్దపడకపోవడంతో ఆయన వెనుదిరిగారన్న ప్రచారం జరుగుతోంది.కాగా జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తమ పాత్ర, తదితర అంశాలపై మాట్లాడుకున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా చర్చించి తమ కార్యక్రమాన్ని నిర్వహించుకునే పనిలో ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతల సమావేశం తర్వాత మళ్లీ మాట్లాడుకుందా మని అన్నారు. కేశవరావు జోక్యం చేసుకుంటూ తమది రాజీలేని పోరాటమని అన్నారు. ఎవరి సహకారం అయినా తీసుకోవాలని అనుకున్నాం . అందరు కలిసి పోరాటం చేయాలని అనుకుంటున్నాం. అందుకే కెసిఆర్ తో మాట్లాడుకున్నామని అన్నారు. రాజీనామాల గురించి అడిగినప్పుడు ఆయన ఆ సంగతి తప్ప మిగిలిన విషయాలు మాట్లాడారు.తెలంగాణపై అధిష్టానంఅనునిత్యం ఆలోచిస్తున్నదని , తమ కార్యక్రమాల ద్వారా కూడా ఆలోచింప చేస్తున్నామని జానారెడ్డి చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక లో ఉన్నఅంశాలలో దేనివైపు మొగ్గు చూపే అవకాశం ఉదన్నదానిపై చర్చించేందుకే కెసిఆర్ వచ్చారన్నారు.అధిష్టానం పెద్దలతో కలిసి మాట్లాడవలసిన అవసరం ఉందని జానారెడ్డి తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!