చంద్రబాబు పత్రికను నడుపుతారా!


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయడు మళ్లీ ఒక పక్ష పత్రికను తీసుకురావాలని భావిస్తున్నారు.ఈ విషయాన్ని ఆయన తన పార్టీ ముఖ్య నాయకులకు మేధోమదనం సందర్భంగా చెప్పారు.ఈ సందర్బంగా పత్రికలు నడుపుతున్న రాజకీయ నాయకులపై ఆయన విసుర్లు విసిరారు. తాము పదిహేడు సంవత్సరాలు అధికారంలో ఉన్నా, ఒక దినపత్రిక నడిపే పరిస్థితిలో లేమని కొందరు బ్లాక్ మెయిల్ ద్వారా డబ్బు తెచ్చి పత్రికను నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ సాక్షి పత్రికను నడుపుతుండగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు నమస్తే తెలంగాణ దినపత్రికను నిర్వహిస్తున్నారు. కాగా వీరిద్దరూ టెలివిజన్ ఛానళ్లను కూడా నడుపు తున్నారు. కాగా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆధ్వర్యంలో ఒక టీవీ ఛానల్ నడుస్తోంది. కాగా ఈ దశలో పక్ష పత్రిక ను తేవాలని, అయితే ఇది కేవలం పార్టీ కార్యకర్తలకే సరఫరా చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.గతంలో కూడా చంద్రబాబు తెలుగుదేశం పేరుతో ఒక పత్రికను నడిపేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న సి.రామచంద్రయ్య దానికి బాధ్యత వహించేవారు.అప్పట్లో అధికారంలో ఉన్న రోజులలనే దానిని సరిగా నడిపేవారు కారు. సంపాదక సిబ్బందికి సకాలంలో జీతాలు ఇచ్చేవారు కారు. దాంతో వారు సి.ఎమ్. కార్యాయలం చుట్టూ తిరగవలసి వచ్చేది. మరి ఈసారి అయినా పక్షపత్రికను సజావుగా నడపడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటారా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!