మెగాస్టార్ కు మెగా పంచ్ లు


పాలిటిక్స్ అంటే స్టెప్పులేయడం అంత ఈజీ కాదని చిరుకు తెలిసింది.. సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులభం కాదనీ తెలిసింది.. అసలు రాజకీయం అంటే.. తనకిష్టమొచ్చి నప్పుడు సినిమా చేసినట్లు కాదనీ అవగతమైంది. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఎప్పుడూ ప్రజలను.. అందులో ఓటేసి గెలిపించిన నియోజకవర్గ జనాలను ఎంతబాగా చూసుకుంటేనే అంత దగ్గరవుతారు. పాపం మన మెగాస్టార్ కు అది ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు.. అంటూ ఇన్ని రోజులు అసలు సిసలు రాజకీయం నడిపించి.. పెట్టిన పార్టీని కాంగ్రెస్ సముద్రంలో కలిపిన చిరంజీవికి.. తిరుపతి ప్రజలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా తొలిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన చిరంజీవిని ప్రజలు అడుగడుగునా నిలదీశారు. ఓటేసి గెలిపించిన పాపానికి తగిన శాస్త్రీ చేశారంటూ చిరుపై ఏకంగా మహిళలు ఎగబడ్డారు. కనీసం గెల్చి ఇంతవరకు ముఖం చూపెట్టకుండా పోతారా అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారి చిరుకు నోట మాట రాలేదు. మరోవైపు ప్రశ్నిస్తున్న మహిళలను చిరు కార్యకర్తలు.. పక్కకు తోసేయడంతో గొడవ మరింత ముదిరింది. ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించుకోకుడదా.. అంటూ ప్రశ్నించారు. ప్రజలకు దగ్గరగా ఉండే మంత్రిపదవి కావాలని ఒకసారి.. కాదు ఏదిచ్చినా సరే అంటూ పదవులపైనే మాట్లాడే చిరంజీవి.. అసలు ఆ పదవి ఎక్కడి నుంచి ఎలా వస్తుందన్న దానిని గురించి మర్చినట్టున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!