తెలంగాణ రాష్ట్రం అసంభ‌వం..!

ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాజ‌కీయ నాయ‌కులంద‌రూ ఒక‌ప‌క్క రాజీనామాలు చేసి కూర్చుంటే.. మ‌రో ప‌క్క సీమాంధ్ర నాయ‌కులు కూడా తెలంగాణ ఉద్యమానికి ధీటుగా స‌మైఖ్యాంధ్ర ఉద్యమాన్ని రూపొంది స్తున్నారు. అంతేకాదు స‌మైఖ్యరాష్ట్రం కోసం ఆ నాయ‌కులు ఢిల్లీ పెద్దల‌ని కూడా క‌లిసి త‌మ వివ‌ర‌ణ‌ని ఇచ్చు కున్నారు. రాష్ట్రం స‌మైఖ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధిస్తుంద‌ని, రాష్ట్రం ముక్కల‌యితే తెలుగు ప్రజానీకానికి తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని వారు అధిష్టానానికి వివ‌రించిన‌ట్టు ఏలూరు ఎంపీ కావూరి సాంబ‌శివ‌రావు అన్నారు. రాష్ట్ర  విభజన వల్ల దేశం ముక్కలయ్యే ప్రమాదముందని అధిష్టానం పెద్దలకు వివరించామని ఆయ‌న చెప్పుకొచ్చారు..  రెండు ప్రాంతాలు కలిసి ఉండడం సాధ్యమేనని అన్నారు.అన్నదమ్ముల మధ్య కూడా అభిప్రాయబేధాలుంటాయని దీంట్లో ఒకరిది విజయం, మరొకరిది ఓటమి కాదన్నారు. క్లిష్టపరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. మూడు ప్రాంతాల నుంచి పరిమిత సంఖ్యలో నేతలు బృందాలుగా వస్తే కూర్చుని చర్చించుకోవచ్చని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారని కావూరి తెలిపారు. అటు తెలంగాణ ఉద్యమం, ఇటు స‌మైఖ్యాంద్ర ఉద్యమం వెర‌సి ఈ స‌మ‌స్యకి ప‌రిష్కార‌మార్గం క‌నుగొన‌డం అధిష్టానానికి పెను స‌వాలుగా మారింద‌న్నది నిర్వివాదాంశం.

కామెంట్‌లు

  1. ఇదన్యాయం, పోరాటాల గడ్డకు వేరే పని చూపాలి. అన్నాహజారే తో చేరి అవినీతికి వ్యతిరేకంగా సెంటిమెంటుతో పోరాడవచ్చు కదా... వూహూ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!