బర్నింగ్ కామెంట్రీ - 14 (రంకుదార్లో రాజకీయం!)
దినమంతా పనిచేస్తే వొక కూలి మాసమంతా పనిచేస్తే మరో కూలి ఈ కూలి డబ్బుల్లో.. శ్రామికుల చెమట వాసన వస్తుంటే ఓక్షణంలో వేసే ఓటుకిచ్చే కోట్లలోని నోట్ల వాసన పసిగడితే.. రోడ్డు పక్కన పైటజార్చి కన్నుగీటే పడతి దగ్గరవచ్చే చీప్ లిక్కర్ తో మిళితమైన మల్లెల వాసన వస్తుంది చూడు నేస్తం! అవును- నేటి రాజకీయం రంకుదార్లో నడుస్తూ అవినీతి విటుల్ని ఆకర్షిస్తూ అడ్డంగా అక్రమంగా వేలకోట్లు కూడబెడుతోంది.. ప్రజాస్వామ్యం నిస్సహాయంగా గుడ్లుతేలేసి `నీతి' అనే సెలైన్ ఎక్కించేవారికోసం చూస్తూనే ఉంది!! తమహక్కును అమ్ముకోకుండా ఓటేసే మారాజులకు - ఓటాఫ్ థాంక్స్!! - నీల్ కొలికపూడి