మీడియా తగలబడింది.. నిజం..! (తమాషాకీ)
మీడియా ఉత్సాహం పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఎలాక్ట్రానిక్ మీడియా ప్రవేశంతో పరిస్థితులు మరింత దిగజారినట్టున్నాయి. ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందు తామే ఇవ్వాలన్న పోటీతో.. ఏ విజువల్ చూపించాలో, ఏది ఆపేయాలో వాటికి అర్థం కానట్టుంది. 31-05-11 మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో ఓ యువతిపై.. ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అడ్డుకున్న యువతిపై సుత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన గ్రామస్థులు… ఆ యువకుడిని సజీవదహనం చేశారు. ఇది ఎంతవరకూ కరెక్ట్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం న్యాయమేనా..? ఇది ఒక కోణం. మరో కోణం.. అన్యాయాన్ని టీవీఛానెళ్లు పనిగట్టుకుని మరీ ఎక్కువగా చూపాయన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తి సజీవదహనాన్ని ఎంత బ్లాక్ అండ్ వైట్ లో చూపినా… దాని ప్రభావం వీక్షకులపై కచ్చితంగా ఉంటుంది. అదీ క్లోజప్ లో చూపేసరికీ చాలామందికి వెన్ను జలదరిస్తుంది. టీవీ అనేది మాస్ మీడియా. పిల్లల నుంచి వృద్దుల వరకూ అందరూ చూసే ప్రసారమాధ్యమమిది. అలాంటి ఘనత వహించిన మీడియా ఎంత జాగురకతతో వ్యవహరించాలి. ఎంత బాధ్యతగా మెసులుకోవాలి. సమాజంలో తప్పొప్పులు ఎత్తిచూపే ఛానెళ్లు.. తమ తప్పు...