నరకలోకం ఉన్నదా? (పార్ట్ 1)


పాపులు నరకలోకానికి వెళతారన్న నమ్మకం దాదాపు అన్ని మతాల్లో ఉంది. అయితే, నిజంగా నరకలోకమంటూ ఒకటుందా? ఒకవేళ ఉంటే, అది అది ఎలా ఉంటుంది?  సౌరకుటుంబంలో దూరాన విసిరేసినట్టున్నగా ఉన్న ప్లూటోకీ, నరకలోకానికీ దగ్గర పోలికలు ఉన్నాయన్న వాదనలు వినబడుతున్నాయి. యమలోకంగా చెప్పుకునే ఈ చీకటిగ్రహంపై ప్రత్యేక కథనం..
సముద్రాలు ఈ భూమిమీదనే ఉన్నాయన్నది ఇప్పటివరకు మనకు తెలిసిన నిజం. అయితే, మనకు తెలియని అనేక గ్రహాల్లో కూడా మహాసముద్రాలే ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. సౌరకుటుంబంలో చిట్టచివరదైన ప్లూటో చుట్టూ కూడా ఇలాంటి ఊహాగానాలే ముసురుకుంటున్నాయి. నరకలోకం ఎలా ఉంటుందన్న ఆసక్తి ఈనాటిది కాదు. వేలాది సంవత్సరాలుగా మనిషి మెదడును తొలుస్తున్న ప్రశ్న. ఎవరి నమ్మకాలతో వాళ్లు, ఎవరి ఆలోచనలతో వాళ్లు – నరకలోకానికి ఓ రూపం ఇచ్చారు.
నరకలోకం అత్యంత భయంకరంగా ఉంటుందన్న CONCLUSIONకి వచ్చేశారు. అయితే ఇదంతా నిజమా…? 21వ శాతాబ్దిలో పరుగులుపెడుతున్న మానవుడ్ని అనునిత్యం వేధిస్తున్న ప్రశ్న ఇది. ఒక పక్క సైన్స్ పరిశోధనలు మూఢనమ్మకాలను చెల్లాచెదురు చేస్తుంటే, మరో పక్క నరకలోకం ఉందన్న వాదనలు బలపడుతుండటం విశేషం. …
వాస్తవాలేమిటో తెలుసుకునేముందు మన సౌరకుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే. సూర్యుడు ఒ మండే అగ్నిగోళం. భయంకరమైన వెలుగుచిమ్మే ఈ అగ్నిగోళంలో కోట్లాది సంవత్సరాల కిందట ఓ పెద్ద విస్ఫోటనం సంభవించింది. దీంతో పెద్దపెద్ద ద్రవ్యరాశులు సునీల ఆకాశంలోకి విసిరివేయబడ్డాయి. అవి కాలక్రమంగా చల్లారి గ్రహాలుగా రూపుదిద్దుకున్నాయి.
అలా విసిరివేయబడ్డ గ్రహాల్లో చాలా దూరంగా నెట్టివేయబడింది యమగ్రహమే. దీన్నే ప్లూటో అని అంటున్నాం. అక్కడ నిలబడి మన సూర్యుడ్ని చూడాలంటే అతగాడో చిన్న చుక్కలాగానే కనబడతాడు. అంటే సూర్యకాంతి దాదాపుగా లేనట్టే. అక్కడ రాత్రిబవళ్లకు ఆట్టే తేడా ఉండదు.
అలాంటి ప్లూటోమీద మహాసముద్రాలున్నాయన్నది కొత్త వాదన పుట్టుకొచ్చింది. అయితే ఈ సముద్రజలం ప్లూటో ఉపరితలంలో లేదట. 200 కిలోమీటర్ల కింద ఉన్నాయని చెబుతున్నారు. ప్లూటో గ్రహంమీద చిమ్మచీకటేకాదు, భయంకరమైన శీతల ఉష్ణోగ్రతలున్నాయక్కడ. నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటేనే తట్టుకోలేకపోతున్నాం. కానీ, అక్కడ మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి.
ఇక్కడ భూమి మీద మనకున్న సముద్రాలకీ, అక్కడివాటికీ పొంతనే లేదన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంటే ఇక్కడిలాగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటం, ఆ సముద్ర జలంలో అనేక జీవరాశి ఉండటం వంటివి కనిపించవనే అంటున్నారు. అయితే ఇదంతా ఊహాగానమే.
నీరు ఉన్నట్టు కచ్చితంగా తేలితే జీవరాశి ఉండే అవకాశాలు ఎంతోకొంత శాతం ఉంటాయన్నది మరికొందరి వాదన. ఒక వేళ ఉంటే…అవి ఎలా ఉంటాయి. అత్యంత భయంకరమైన చలిలో ఆ చీకట్లో అవి ఎలా మనగలుగుతున్నాయి. ఈ కోణాల్లో పరిశోధనలు ఇంకా జరగాల్సిందే.
(ఇంకా ఉంది)
- తుర్లపాటి నాగభూషణ రావు
9885292208 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!