ప్రముఖులంద‌రికీ మ‌ద్యం వాటాలు..?


రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక నిరోధక శాఖ జరిపిన దాడులలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం సిండికేట్ల ఆఫీస్ లపై నేరుగా ఎసిబి అధికారులు జరిపిన ఈ దాడులలో ఆ సిండికేట్లు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు చెల్లిస్తున్నది రాసిన లెక్కలు బహిర్గతమయ్యాయని చెబుతున్నారు. దీని ప్రకారం ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, చివరికి మీడియా ప్రతినిధులకు కూడా మద్యం ముడుపులు దక్కుతున్నాయంటే సమాజం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. అసలు అవినీతిని పెద్ద సమస్యగా వీరెవ్వరూ భావించడం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి పది లక్షల రూపాయల మేర నెలకు వసూలు చేసుకుంటున్నారట. ఒక్క గుంటూరు జిల్లాలలోనే నెలకు ఆరు కోట్ల మేర ముడుపుల రూపేణా చెల్లిస్తున్నట్లు తేలింది. అలాగే అన్ని జిల్లాలలో ఇదే తరహా పరిస్థితి కొనసాగుతోంది.కరీంనగర్ , ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఇదే విధంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణకు పలు మద్యం సిండికేట్లలో భాగస్వామ్యం ఉన్న నేపధ్యంలో కూడా ఈ దాడులకు ప్రాధాన్యత ఉందని ప్రచారం జరుగుతోంది.అయితే ఆ సంగతి ఏమో కాని, రాష్ట్రం అంతటా ఎవరెవరికి ఎంత ముడుపులు దక్కే విషయం బయటపడడం మాత్రం అందరికి ఆందోళనకరంగా మారింది. అయితే ఒక మంత్రి దీనిపై మాట్లాడుతూ , ఇందులో వారు , వీరు అనేముంది అందరికి వాటా వస్తోంది. అందువల్ల ఎవరూ దీనిపై పెద్దగా ఇష్యూ చేయకపోవచ్చు. చేస్తే అందరూ అల్లరవుతారు అని వ్యాఖ్యానించడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!