చ‌ట్టం చేస్తే ‘మ‌త్తు’ దిగుతుందా..?


మ‌ద్యం సింగికేట్లని అదుపు చేయ‌డానికి ప్రత్యేక చ‌ట్టం చేసిపారేస్తామ‌ని మంత్రివ‌ర్యులు టి.జి. వెంక‌టేష్ ప్రక‌టించారు.. బాగానే ఉంది.. కానీ.. పార్టీల‌క‌తీతంగా మ‌ద్యం వ్యాపారంలో రాజ‌కీయ‌ నాయ‌కులు పీక‌ల్లోతుల్లో మునిగి జ‌నాల‌ని నిండా మ‌ద్యం మ‌త్తులో మంచుతూంటే… చ‌ట్టాల‌తో ఆ మ‌త్తుని దించేయ గ‌ల‌రా…? చ‌ట్టాల‌ని త‌యారు చేసేవారే కోట్ల రూపాయల పెట్టుబ‌డితో మ‌ద్యం సిండికేట్లు చేస్తుంటే ఇక ఆ చ‌ట్టాలు త‌యారు చేయ‌డం వ‌ల్ల ఒరిగేదేముంటుంద‌న్నది ప్రశ్న. ఏదో చ‌ట్టాల‌ని త‌యారు చేశామ‌న ప్రక‌టించేసి, కొన్నాళ్ళు హ‌డావిడి చేసి చ‌వ‌రికి ఆ చ‌ట్టాల‌ను కాగితాల వ‌ర‌కే ప‌రిమితం చేయ‌డం మాత్రం ఖాయంగానే జ‌రుగుతుంటుంది.. పైగా అవినీతికి వ్యతిరేకంగా ర్యాలీలు, గంట‌ల కొద్దీ ఉప‌న్యాసాలు దంచేసే నాయ‌కుల అండ‌దండ‌లు పుష్కలంగా ఉన్న ఈ మ‌ద్యం సిండికేట్లని పెకిలించేసే ద‌మ్ము అధికారుల‌కి ఎక్కడి నుండి వ‌స్తుంది.. పైగా రాష్ట్ర ఖ‌జానాకి వేల కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని స‌మ‌కూర్చే మ‌ద్యం వ్యాపారాల‌లో జ‌రుగుతున్న అవినీతిని ప్రభుత్వం కూడా చూసీ చూడ‌కుండా పోతుందే కానీ, చ‌ర్యలు చేప‌ట్టడం సాధ్యమ‌వుతుందా.. అన్నది సామాన్యుల మ‌దిలో మెదులుతున్న ప్రశ్న. పైగా మ‌ద్యం సిండికేట్లుగా ఏర్పడి ల‌క్షల‌కు ల‌క్షలు చెల్లించి లైసెన్సులు సంపాదించుకున్న మ‌ద్యం వ్యాపారులు తాము పెట్టిన పెట్టుబ‌డి రాబ‌ట్టుకోవ‌డానికి ఎమ్మార్పీ రెట్లకంటే ఎక్కువ‌గా వ‌సూలు చేస్తున్నార‌న్నది స‌త్యం.. ఇప్పుడ ఒక్కసారిగా ఎమ్మార్పీ రేట్లకే మ‌ద్యాన్న విక్రయించాలంటే వారు అంగీక‌రిస్తారా…? అంతేకాదు మ‌రోప‌క్క మ‌ద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే ఎంక‌రేజ్ చేస్తూ.. ఎన్నో చోట్ల షాపుల‌ని తెరిపించేలా చ‌ర్యలు తీసుకుంటుంద‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి. పైగా ఆయా మ‌ద్యం త‌యారీ సంస్థల‌తో లోపాయికారీ ఒప్పందంతో ఎమ్మార్పీ రేట్లనే పెంచేవిధంగా కూడా ప్రభుత్వం పావులు క‌దుపుతుంద‌న్న విమ‌ర్శలూ ఉన్నాయి. ఇలా చ‌ట్టాలు త‌యారు చేసే ప్రభుత్వమే చ‌ట్టాల‌ని అతిక్రమించే ప‌నులు చేస్తుంటే.. ఇక ఆ.. చ‌ట్టం.. చేస్తే.. ఎంత‌.. చేయ‌క‌పోతే ఎంత‌..? ఏమంటారు..?
-సిఎస్‌కె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!