నరకలోకం ఉన్నదా? (పార్ట్‌-3)


ప్లూటోనే నరకలోకమా?

సౌరకుటుంబంలోని ప్లూటో గ్రహ పరిస్థితికీ, వేలసంవత్సరాల కిందటే రాసిఉంచిన నరకలోక వర్ణనకు పోలిక ఉండబోతున్నదా? యమగ్రహంలో అత్యంత భయానక పరిస్థితి ఉన్నదా?
ప్లూటోలో ఉన్నట్టు చెబుతున్న ఈ సముద్రాలు దేనికి సంకేతాలు? చీకటి గ్రహంపై ఉన్న పరిస్థితులు అచ్చంగా నరకలోకాన్నే తలపిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ గ్రహమే నరకలోకం ఎందుకు కాకూడదు? ఈ దిశగా కూడా ఆలోచనలు సాగుతున్నాయి.
ఈ భూమిమీద సముద్రాలుండటంతో మరెక్కడైనా ఇలాంటివి ఉండవచ్చన్న ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. అయితే ఇంతవరకు సరైనా ఆధారాలు లభించకపోయినా, ప్లూటో లో సముద్రాలు ఉండవచ్చన్న ఆలోచనలు మొగ్గతొడిగాయి. నిజంగానే ప్లూటోపై సముద్రాలు, నదులు ఉండిఉంటే, అవి మన పూర్వీకులు చెప్పిన నరకలోకంలోని వైతరణి వంటి నదులతో పోల్చవచ్చని వాదించేవారూ ఉన్నారు.
నరకలోకం ఓ చీకటి గుయ్యారంగాఉంటుందని గరుడపురాణం చెప్పింది.
సరిగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇకఇప్పుడు నీటి జాడలు కూడా ఉన్నాయని చెప్పడంతో ఆ నీటిలో జీవరాశి కూడా ఉండే అవకాశం లేకపోలేదు. అదే నిజమయ్యే పక్షంలో నరకలోకంలో వర్ణించిన భయంకరమైన జీవాలు అక్కడ సంచరిస్తున్నాయని అనుకోవచ్చా? అవేనా సూక్ష్మ శరీరాలతో అక్కడకు చేరిన వారిని చిత్రహింసలకు గురిచేసేవి? అలాంటి జీవాలనేనా మనవాళ్లు యమభటులుగా చిత్రీకరిస్తోంది…??
ప్లూటో గ్రహం మిగతా గ్రహాల్లాగా లేదు. ఇది చాలా పెడసరంగా తిరుగుతోంది. అక్కడి వాతావరణం, ఆ గ్రహం నుంచి కనిపించే చందమామలు…ఇవన్నీ చూస్తుంటేనే ఓ వింతలోకంలోకి అడుగుపెట్టినట్టుంది.
అందుకనేనా మనవాళ్లు దాన్ని నరకలోకం అని పిలుస్తోంది…??
ప్లూటోమీద జీవరాశి విచిత్రంగా ఉందని భావించే పక్షంలో అది నరకలోక వర్ణనలా ఎందుకుండకూడదన్న వాదనలు వినవస్తున్నాయి.
(ఇంకా ఉంది)
- తుర్లపాటి నాగభూషణ రావు
9885292208

కామెంట్‌లు

  1. నరక లోకం అనేది సూక్ష్మ లోకం , బౌతిక లోకం లో ఉన్న ప్లూటో ..శని ఇవి కావు ..సూక్ష్మ లోక ప్రతిబింబమే ఈ బౌతిక లోకము ..అంతే గాని అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ కూడా ఉండాలని లేదు. సూక్ష్మ లోక సందర్సన సూక్ష్మ శరీరము తో మాత్రమె జరుగుతుంది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!