ఉప ఎన్నిక‌లు ఎప్పుడు..?


దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలకు షెడ్యూల్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి, స్పీకర్ కార్యాలయానికి కాస్త టెన్షన్ పెట్టేలా ఉంది. జనవరి ఇరవై ఎనిమిదిన మణిపూర్, జనవరి ముప్పైన పంజాబ్, ఉత్తరాఖండ్, ఫిబ్రవరి నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏడు దశలలో ఉత్తరప్రదేశ్ లో , మార్చి మూడు న గోవాలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. మార్చి నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా పదకుండు కోట్ల ఇరవై లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. పంజాబ్ లో 11౭ స్థానాలు ఉండగా, ఉత్తరాఖండ్ లో డెబ్బై స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 403 నియోజకవర్గాలు ఉన్నాయి. గోవాలో నలభై, మణిపూర్ లో అరవై స్థానాలు ఉన్నాయి. కాగా ఆంద్రప్రదేశ్ ఉప ఎన్నికల తేదీని తర్వాత వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది. బహుశా కొద్ది రోజులలో ఈ తేదీలు వెల్లడించవచ్చు. ఈలోగా స్పీకర్ కార్యాలయం వై.ఎస్.ఆర్‌.కాంగ్రెస్ వర్గ ఎమ్మెల్యేల విషయం తేల్చుతుందా? లేదా అన్నది చూడాల్సిందే. గతంలో కూడా సాధారణ ఎన్నికల సమయంలో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అలాగే ఇప్పుడు విడిగా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వవచ్చు. కాకపోతే ఎప్పుడు షెడ్యూల్ వస్తుందన్నదే ఆసక్తికరం. ఇప్పటికే స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విమర్శలను చేస్తున్న నేపద్యంలో మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాలకు ఎన్నికలు వచ్చేలా స్పీకర్ వ్యవహరిస్తారా? లేక ముందు ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు నియోజకవర్గాలకు, ఆ తర్వాత మిగిలిన పదిహేడు స్థానాలకు ఎన్నికలు వచ్చేలా చూస్తారా అన్నదానికి వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!