ఎమ్మెల్సీల‌పై కూడా అన‌ర్హత వేటు..?


అవిశ్వాసం తీర్మానంలో పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిర్ణయించుకున్న కాంగ్రెసు పార్టీ తాజాగా శాసనమండలి సభ్యులపై కూడా చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. జగన్‌తో వెళుతున్న ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలపై శాసనమండలి చైర్మన్‌కు త్వరలో కాంగ్రెసు ఫిర్యాదు చేయనుందని సమాచారం.
జగన్ వర్గంలో ఉన్న కొండా మురళీ, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులపై అనర్హత పిటిషన్ చైర్మన్‌కు ఇవ్వనున్నారు. ఉదయం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యేలపై మంగళవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశముంది. మరోవైపు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!