ఆహార భ‌ద్రత రూప‌క‌ల్పన‌లో ఆంధ్ర ఐఎఎస్ అధికారి


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆహార భద్రత బిల్లును ఆమోదించింది. ఇక ఇది పార్లమెంటుకు రావడమే తరవాయి. ఈ బిల్లు ప్రకారం దేశంలోని అరవైమూడు శాతం మందికి చౌక ధరకు బియ్యం , గోధుమలు వంటి ఆహార ధాన్యాలు లభిస్తాయి.ఈ పధకం కింద ప్రతి నెల పదిహేను కిలోల చొప్పున బియ్యాన్ని పేద కుటుంబానికి అందించాలని పధక రచన చేశారు. ఈ పధకం లోని గుణగుణాలను విశ్లేషిస్తే ఒకరకంగా పేదలకు ఆహార భద్రత చేకూర్చే ఈ పధకం మంచిదే. అదే సమయంలో వ్యవసాయ రంగానికి అసలే పనివారు దొరకని పరిస్థితి ఆ రంగం ఈ స్కీమ్ వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్లవచ్చని కొందరి అనుమానం. గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ వల్లనే సమస్యలను ఎదుర్కుంటున్న వ్యవసాయం , ఈ స్కీమ్ తో మరింత సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది.1982 లో ఎన్.టి.రామారావు తొలుత కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చే పదకాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పట్లో దీనిని నిరర్ధక స్కీమ్ అని విమర్శించినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దానిని మూడున్నరకు పెంచింది. తిరిగి 1994లో కిలో రెండు రూపాయలకే అమలు చేశారు. తదుపరి చంద్రబాబు నాయుడు దాని ధరను ఐదు రూపాయలుచేశారు. కాగా రెండునేల నాలుగులో అదికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి మానిఫెస్టోలో లేకపోయినప్పట్టికీ కిలో బియ్యం పధకం రెండు రూపాయలకే అమలు చేశారు. దానిని కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికి కిలో బియ్యంగా మార్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశం అంతా ఆహార భద్రత స్కీమ్ కింద సబ్సిడి పధకాన్ని అమలు చేయబోతోంది. దీని వెనుక మన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఐఎ ఎస్ అధికారి కె.రాజు పాత్ర కూడా ఉండడం విశేషం. జాతీయ సలహా మండలి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజు ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీకి సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన ఈ స్కీమ్ ను ప్రతిపాదించారని చెబుతారు. 31 వేల రూపాయల భారం పడే ఈ స్కీమ్ పై కేంద్ర మంత్రులలో కొందరికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పట్టికీ సోనియాగాంధీ చొరవతో ఆమోదించినట్లు కనబడుతుంది. అయితే ఇది ఓట్లను ఆకర్షించే స్కీమ్ అవుతుందా? ప్రజలకు ఉపయోగపడుతుందా? నల్ల మార్కెట్ దారులకు ఉపయోగపడే స్కీమ్ గా మారుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!