కోనేరుకు బెయిల్ నిరాక‌ర‌ణ‌


ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడు కోనేరు రాజేంద్రప్రసాద్‌కు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ సోమవారం కొట్టివేశారు. కోనేరు తమ దర్యాప్తునకు సహకరించలేదని, విల్లాలను అడ్డగోలుగా విక్రయించడం ద్వారా రూ. 138 కోట్లు ఆర్జించారని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు.
లెక్కల్లో తక్కువ చూపి విల్లాలను ఎక్కువ మొత్తానికి విక్రయించారని, ఈ సొమ్ము దుబాయిలోని కోనేరు కుమారుడు మధు ఖాతాల్లోకి వెళ్లిందని తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు సహకరించరాదని ప్రసాద్, ఆయన కుమారుడు మధు నిర్ణయించుకున్నారని ఆరోపించారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేస్తారని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!