హోంమినిస్టర్‌@5వేల కోట్లు..


రాష్ట్ర మంత్రి డాక్టర్ పి.శంకరరావు కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ పై దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.ఏకంగా ఇప్పుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అవినీతి కంటే ఇప్పుడే అవినీతి అధికంగా ఉందని బాంబు పేల్చారు.ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ది నీతివంతమైన పాలన అని, అవినీతి రహిత ప్రభుత్వం ఇవ్వడమే తమ లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. దానిని ప్రధాన ప్రచారంశంగా చేసుకున్నారు. అలాంటి తరుణంలో ఆయన క్యాబినెట్ లోని ఒక మంత్రే ఏకంగా ఇలాంటి అరోపణలు చేయడం విశేషం. వై.ఎస్. జగన్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు లేఖ రాసి సంచలనం సృష్టించి, సిబిఐ విచారణకు కారణభూతుడైన శంకరరావు ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.అంతేకాక రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మరింత ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఆమె ఏకంగా ఐదువేల కోట్లు సంపాదించారని ఆరోపిస్తున్నారు. శంకరరావు కొందరు మంత్రుల అవినీతిపై ఆరోపణలు చేస్తూ గవర్నర్ వద్ద వరకు వెళ్లి వచ్చారు.అయినప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి కదలిక లేదు. హైకోర్టులు కూడా పట్టించుకోవడం లేదు. పోనీ శంకరరావును పదవిలో నుంచి తప్పించే సాహసం ముఖ్యమంత్రి చేయలేకపోతున్నారు. ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం అనుకోవాలా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!