కోర‌లు లేని బిల్లు..


లోక్‌పాల్ బిల్లు స్పూర్తిని నీరుగార్చేలా చేశారని, లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐని తేవాల్సిందే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలన్నారు. అవినీతిపరులను కఠినంగా శిక్షించేలా బిల్లు రావాలని బాబు పేర్కొన్నారు. అవినీతిపై ఎవరు పోరాడినా మద్దతు తెలుపుతామని, అవినీతి రహిత భారతదేశం కావాలని, దేశంలో అవినీతి అంతానికి జన్‌లోక్‌పాల్ బిల్లును అమలుచేయాలని చంద్రబాబు సూచించారు. కేంద్రం బ్లాక్‌మెయిల్ రాజకీయాలను పాల్పడుతోందని, అవినీతి మంత్రులకు మద్దతునిస్తోందని చంద్రబాబు విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. హోంమంత్రే అరాచకవాదులకు మద్దతిస్తున్నారని బాబు ఆరోపించారు. కేబినేట్ మంత్రిపై హోమంత్రి మనుషులే దాడి చేశారని పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!