ముడుపులు అంద‌లేద‌నేనా..?


మద్యం సిండికేట్లపై దాడుల వెనుక వాటాలే లక్ష్యమంటూ మీడియాలో కధనాలు వస్తున్నాయి.దీనికి ప్రధానంగా ముఖ్యనేత సోదరుడు ఒకరు కారణమని, ముఖ్యనేత అని చెప్పడం ద్వారా పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే ఈ కధ నడిపించారని సాక్షి కధనాన్నిఇచ్చింది. ఈ అభియోగంలో ఎంత నిజం ఉందో కాని కాస్త సంచలనంగానే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిజాయితీగా పాలన చేయడానికి యత్నిస్తున్నారని అభిప్రాయం కలుగుతున్న తరుణంలో ఇలాంటి కధనం రావడంలో అందులో వాస్తవం ఉందా? లేక ఆయనను అప్రతిష్టపాలు చేయడం లక్ష్యమా అన్నది చూడాల్సి ఉంటుంది. ముఖ్యనేత అంటే ముఖ్యమంత్రి అన్న అర్ధం వచ్చే విధంగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా రాసే కధనాలలో ఆ పదం వాడుతున్నారు. తాజా కధనం ప్రకారం మద్యం సిండికేట్ల నుంచి ముఖ్యనేత సోదరుడు పది కోట్ల రూపాయల వాటా అడిగారని, దానిపై ఒప్పందం కుదరనందునే ఆయా జిల్లాలలో మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించారని రాశారు. అయితే ఇందులో రెండు అవసరాలు ఉన్నాయి. ఒకటి బొత్సను దెబ్బతీయడం అన్న విశ్లేషణ, మరొకటి ఆర్ధిక అవసరాలు అన్నది. అయితే ఇవేవి కావని, కాకతాళీయంగానే ఎసిబి దాడులలో బయటపడిన విషయాలని అధికారవర్గాలు వివరణ ఇస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!