చిరంజీవిపై అధిష్టానం అసంతృప్తి..?


మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉన్న సమయంలో ఆయన అమాయకంగా వ్యవహరించి మైనస్ పాయింట్లు తెచ్చుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తు న్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా పార్టీ నాయకత్వం వద్ద మంచి మార్కులు పొందిన చిరంజీవి అవిశ్వాస తీర్మానం సందర్భంగా కొంచెం బెట్టుచేసి దెబ్బ తిన్నారని ప్రజారాజ్యం పార్టికి చెందిన ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. కొంతకాలం క్రితం చిరంజీవి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు యు ఆర్ వర్కింగ్ అండర్ మై లీడర్ షిప్ , మీ ఎమ్మెల్యేల జాబితా తెచ్చారా? ఎవరికి ఏమేమి ఇవ్వాలో పేర్కొన్నారా? అని ప్రశ్నించారట. అయితే అప్పుడు చిరంజీవి ఎలాంటి జాబితాతో వెళ్లలేదు. ఆ తర్వాత చిరంజీవి తన ఎమ్మెల్యేలతో భేటీ అయినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడే సరైన సమయం కాంగ్రెస్ పార్టీని మన దారిలోకి తెచ్చుకోవాలని అసంతృప్తి వ్యక్తం చేయాలని అన్నప్పుడు మరికొందరు వ్యతిరేకించారు. అయినా కాంగ్రెస్ పై కాస్త అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు చిరంజీవిపై ఒత్తిడి తెచ్చి అనవసర ప్రకటన చేయించారని, దాంతో ఆయనకు అధిష్టానం వద్ద మైనస్ మార్కులు పడ్డాయని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే చిరంజీవి తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకున్నారు కాని, అధిష్టానం కు వ్యతిరేకం అని భావించలేదని, కాని పార్టీ లో కొందరు మాత్రం చిరంజీవి లేనిపోని సమస్య సృష్టిస్తున్నారన్న భావాన్ని వ్యాపింప చేశారని , దీనివల్ల తమకు కాస్త నష్టం కలిగే పరిస్థితి ఏర్పడిందని ఆ ఎమ్మెల్యే అంటున్నారు. ఇదంతా చిరంజీవి అమాయకత్వాన్ని కొందరు ఎమ్మెల్యేలు వాడుకోవడం వల్లనే జరుగుతోందని వేరొక నాయకుడు వ్యాఖ్యానించారు. అయితే దీనివల్ల ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదం జరుగుతుందని కాదు కాని, అనవసరంగా కాంగ్రెస్ అధిష్టానంలో అనుమానానికి ఆస్కారం ఇచ్చారన్నది ఇంకొందరి వాదన.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!