ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు ! (పార్ట్ 2)


1977లో దేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు లోక్ పాల్ బిల్లు చురుగ్గానే కదిలింది. కానీ స్థాయీ సంఘం నివేదిక ఇచ్చేలోపే జనతా ప్రభుత్వం కూలిపో యింది.

ఇందిరాగాంధీ పాలనకు  వ్యతిరేకత పెల్లుబికిన రోజులవి. జనతాపార్టీ  తిరుగుబాటు  బావుటా ఎగరేసిన రోజులవి. ఈ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. 1977లో దేశచరిత్రలోనే తొలిసారిగా  కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సమయంలోనే అవినీతిని అంతంచేయాలన్న దృఢసంకల్పంతో  లోక్ పాల్ బిల్లును వెలికితీశారు. పార్లమెంట్ లో బిల్లుపై చర్చ జరిగింది. ఇప్పటిలాగానే అప్పట్లో కూడా స్థాయీసంఘానికి పంపించారు. ఈ సంఘం తన నివేదికను ఇవ్వడానికి ముందే జనతా ప్రభుత్వం కూలిపోయింది. లోక్ పాల్ బిల్లు ముట్టుకోగానే   రాజకీయ సంక్షోభం రావడం ఇది మూడోసారి.   మరి దీన్ని ఎలా అనుకోవాలి? కాకతాళీయంగానే భావించాలా…లేక ఇంకేదైనా అతీతమైన కారణం దాగుందా?
ఇందిరాగాంధీ హత్యానంతరం ఆమె కుమారుడైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ పాలన సాగుతున్నప్పుడు కూడా దేశంలో అవినీతికి బ్రేక్ వేసే ఒక బిల్లు తీసుకురావాలనుకున్నారు. లోక్ పాల్ బిల్లుకు చట్టబద్ధత తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది. అలా 1985లో నాలుగోసారి  ఈ బిల్లు పార్లమెంట్ గడపతొక్కింది. ఈసారి ప్రభుత్వమే బిల్లుకు గండికొట్టింది. అయితే, తదుపరి రాజకీయ పరిణామాల్లో రాజీవ్ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రాజీవ్ అవినీతే ఎజెండాసాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తయింది.
ఇక్కడితో లోక్ పాల్ బిల్లు చుట్టూ తిరుగుతున్న రాజకీయ విషాదగాధ అయిపోలేదు. తాజా నిర్ణయంతో కలుపుకుంటే మరో ఆరుసార్లు బిల్లును పార్లమెంట్ గడప తొక్కించారు. ఆ వివరాలు మూడో భాగంలో…
- తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!