భగత్ సింగ్ ను ఉరి తీయండి !

   అదేమిటీ 2011 డిసెంబర్ 13న భగత్ సింగ్ ను ఉరితీయండి అంటూ వార్త పెట్టారనుకుంటున్నారా... ఒక్కోసారి గతం కూడా వర్తమాన వార్తల్లోకి ఎక్కుతుంది. ఈ ఫోటో కూడా అలాంటిదే.
 అది 1931 మార్చి నెల 23వ తేదీ. ఆ రోజునే భగత్ సింగ్ ను ఉరితీశారు. అంతకు ముందు జైల్ సూపరింటెండెంట్ ఉరి ఉత్తర్వును అధికారికంగా విడుదలచేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఉరితీశాక ఓ గంటసేపు శరీరం గాలిలోనే తేలియాడుతూ ఉండాలని కూడా ఈ ఉత్తర్వుద్వారా ఆదేశించారు. భగత్ సింగ్ మరణించారని వైద్యాధికారి ధ్రువీకరించేవరకు శరీరాన్ని కిందకు దింపకూడదు. ఇదంతా కచ్చితంగా అమలవ్వాలన్నదే జైలు అధికారి ఉత్తర్వులోని సారాంశం.
 దేశం కోసం భగత్ సింగ్ అలా ప్రాణత్యాగం చేశారు. మరి నేటి రాజకీయనాయుల్లో ఎంత మంది లక్షల కోట్ల కుంభకోణాల్లో చిక్కుకున్నా దర్జాగా తిరుగుతున్నారు. నాటి కఠిన చట్టాలు నేడు లేవు. నాటి కఠిన శిక్షలు అంతకన్నాలేవు. అందుకే ధైర్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. మరి మన స్వతంత్ర్య దేశం ఎటుపోతోంది. ఓసారి ఆలోచించండి.
                                                                         - తుర్లపాటి నాగభూషణ రావు
                                                                                               98852 92208

కామెంట్‌లు

  1. భగత్ సింగ్ is a great patriot..
    our dirty politicians didn't pay any respect to him.
    at least they didn't consider his name for Govt projects or schemes...
    they always confined to Nehru's family only...
    also there are many patriots who scarified their lives for nation..
    as we Indians we must memorize them.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!