హస్తినలో జగన్
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సతీమణి భారతితో కలిసి వచ్చిన ఆయన, ఈ నెల 21 వరకు ఢిల్లీలో ఉంటారు. సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరవుతారు. గుంటూరు ఓదార్పు యాత్ర నుంచి జగన్ శనివారం హైదరాబాద్‌కు తిరిగి రావడం తెలిసిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి