తెలంగాణ‌కి వ్యతిరేకం కాద‌ట‌..!


“తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత… అధికారం కేంద్రానికే ఉన్నాయి. తక్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మనం కేంద్రాన్ని పదే పదే కోరాం. మనం అధికారంలో లేం. నిర్ణయం తీసుకొనే శక్తి మన చేతిలో లేదు. తెలంగాణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తే మనం ఆపగలుగుతామా? కాంగ్రెస్‌తో కుమ్మక్కైన శక్తులే వాస్తవాలను దాచిపెట్టి మనను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు అదే చెప్పండి” అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు. అనేకసార్లు ఈ విషయం బహిరంగంగానే చెప్పాను. గత ఎన్నికల ముందు తెలంగాణకు అనుకూలంగా మనం నిర్ణయం తీసుకొన్నాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చాం.
తెలంగాణకు వ్యతిరేకమైతే ఈ పని ఎందుకు చేస్తాం? ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పండి” అని ఆయన కోరారు. కాగా.. ఇటీవల పార్టీకి దూరమైన నాగం జనార్దన రెడ్డి వైఖరిపై సమావేశంలో కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. రానున్న ఉప ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు బాలేశ్వర్, డాక్టర్ చిన్నయ్య, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, పరంధాం గౌడ్‌లతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. మండలాలవారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాక అభ్యర్థిని ఖరారు చేయాలని నిర్ణయించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!