రాజ‌కీయాల్లోకి ర‌మ‌ణాచారి..?


సీనియర్ ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారి ఎక్కడ ఉన్నా పౌర సంబంధాల విషయంలో మిన్నగా వ్యవహరిస్తారు.అందుకే ముఖ్యమైన అన్ని సందర్భాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రమణాచారి సేవలను ఉపయోగిస్తుంటుంది. ఆయన ఇప్పుడు స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఆయన ఏ కారణంతో పదవీ విరమణ చేసుకున్నారన్నదానిపై భిన్నమైన కధనాలు వినిపిస్తున్నాయి. రమణాచారి రాజకీయాలలోకి రావచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా , సమాచార హక్కు కమిషనర్ లు కొందరిని నియమించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారని, ఒక కమిషనర్ పదవిని రమణాచారి కి కేటాయించవచ్చని అందుకే ఆయన మూడు నెలలు ముందుగా స్వచ్చంద పదవీ విరమణ చేసుకున్నారని చెబుతున్నారు. కాగా రమణాచారి రాజకీయాలలోకి వస్తే ఏ రాజకీయ పార్టీలోకి చేరతారు అన్నదానిపై కధనాలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన రమణాచారి టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపవచ్చని కొందరు భావిస్తుంటే, అదికార కాంగ్రెస్ లో చేరవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే రాజకీయాలకన్నా రమణాచారి సమాచార హక్కు కమిషనర్ పదవి తీసుకోవడానికే అవకాశాలు ఉన్నాయని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.ఐదేళ్లపాటు ఈ పదవిలో ఉండవచ్చు. ఐదేళ్ల పదవీకాలం వస్తున్నప్పుడు మూడు నెలల ఐఎఎస్ పదవీ కాలం వదులుకోవడం పెద్ద సమస్య కాదని అంటున్నారు. రమణాచారి ఎక్కడ ఉన్న తనదైన ముద్ర వేయగల శక్తిమంతులని మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!