రేపో మాపో పెట్రోల్ ధర పెంపు


రూపాయి మారకం విలువ మరింతగా దిగజారడంతో దాని ప్రభావం పెట్రో ఉత్పత్తులపై నేరుగా పడబోతున్నది. అమెరికా డాలర్ తో పోలిస్తే ఇప్పటికే రూపాయి విలువ కనిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా డాలర్  రూ. 53.75 పలుకుతోంది. దీంతో డాలర్లు కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. మరో పక్క చమురు దిగుమతి దారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనదేశంలో లీటర్ పెట్రోల్ ధర 65 పైసలు పెరిగే అవకాశాలున్నాయి. నేరుగా చమురు కంపెనీలు లీటర్ కు 55 పైసలు, లేదా 56 పైసలు పెంచొచ్చు. అయితే, స్థానిక సుంకాలు కలుపుకుంటే ఇది 65 పైసలకు పెరుగుతుందని అంచనావేస్తున్నారు.

కామెంట్‌లు

  1. నేను అదే అనుకుంటున్నాను. రూపాయి విలువ తగ్గినా, డాలర్ విలువ పెరిగినా పెట్రోల్ ధరలు పెరుగుతాయి కదా. ఇంకా పెరగలేదేమిటా అని నేను అనుకుంటున్నాను. అమెరికా భిక్ష పడేస్తే ఏరుకునే ఆర్థిక విధానాలు ఉన్నంత వరకు మన దేశంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. మన కున్న వాటితో జీవించటం చేతకాకపోతే అమెరికా అయినా ఇండియా అయినా చివరికి మనమయినా ఇంకొకళ్ళ ఆధారంతో బతకటం తప్పదు.

    రిప్లయితొలగించండి
  3. అమెరికా మనం అనుకున్నంత ధనిక దేశం కాదు. 1960లు & 1970ల టైమ్‌లో అమెరికా కూడా వ్యవసాయంపై భారీగా ఆధారపడింది. అప్పట్లో కేలిఫోర్నియా రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండేది, ఎరువులు & పురుగు మందుల వినియోగంలో కూడా మొదటి స్థానంలో ఉండేది. 1980 తరువాత ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్ధి చెంది అమెరికా ఆర్థిక పరిస్థితి మారింది. అంతే. 1970ల టైమ్‌లో అమెరికా నుంచి ఇండియాకి గోధుమలు దిగుమతి అయ్యేవి. గోదావరి నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో చాలా చోట్ల గోధుమలు పెరుగుతాయి. అటువంటప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది అని సందేహం రావచ్చు. కానీ మన పాలకులు అమెరికా పడగ నీడలోకి మనల్ని నెట్టి పరిపాలిస్తున్నవాళ్ళు కదా.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!