పార్లమెంట్‌పై దాడికి ప‌దేళ్లు


పార్లమెంట్ భవనంపై దాడి జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. భారత దేశ సార్వభౌమత్వానికి ప్రతీక అయిన ఈ అమూల్యమైన భవనాన్ని తీవ్రవాదుల నుంచి ఆ జవాన్లు రక్షించగలిగారు గానీ.. దాడి జరిగిన ప్రదేశానికి తీసుకెళతా మంటూ తమ పిల్లలకు ఇచ్చిన హామీని మాత్రం ఇంత వరకు నెరవేర్చలేక పోయారు పాపం.  2001 డిసెంబర్ 13న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలోని ముష్కరులు.. పార్లమెంట్ భవనంపై దాడికి యత్నించిన విషయం విదితమే. ఆ దాడిని సీఆర్‌పీఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. భద్రతదళాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల తూటాలకు 8 మంది జవాన్లు నేలకొరిగారు. ఇలా పార్లమెంట్ భవనంపై జరిగిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టినందుకు సీఆర్‌పీఎఫ్ జవాన్లు డి.సంతోశ్ కుమార్, వై.బి.థాపాలను అత్యున్నత పురస్కారాలతో కేంద్ర సర్కారు సన్మానించింది. అయితే.. ఉగ్రవాద దాడిని తాము తిప్పికొట్టిన ప్రదేశాన్ని తమ పిల్లలకు చూపుతామని వీరిద్దరూ హామీ ఇచ్చారట. ఈ దాడి జరిగి పదేళ్లయినా కూడా తమ పిల్లలకు తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయామని వాపోతున్నారు. విధి నిర్వహణలో భాగంగా వీరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కావడం, సెలవు దొరకకపోవడం ఇందుకు కారణాలని వీరు చెబుతున్నారు. “మా పిల్లలు బడిలో చదువుకుంటున్నప్పుడు.. మేం ఈ హామీ ఇచ్చాం. ఇప్పుడు వారిలో కొందరు కాలేజీల్లో కూడా చేరారు. అయినా మా మాట నిలబెట్టుకోలేకపోతున్నాం” అని సంతోశ్, థాపా వాపోతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!