తెలంగాణ‌కి కాంగ్రెస్ నో..?


తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ బ్యానర్ కధనాన్ని ఇచ్చింది.కొత్త సంవత్సర బహుమతిగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం లేదని ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ కధనం వెల్లడిస్తోంది.రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేనందున తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించవచ్చని అంటున్నారు.అంతేకాక తెలుగుదేశం పార్టీ ఒక విధానానికి కట్టుబడకుండా వ్యవహరించడం కూడా కారణమన్న అభియోగాన్ని మోపనున్నారు.అలాగే కాంగ్రెస్ లో విలీనం కావడానికి టిఆర్ఎస్ ముందుకు రావకపోవడాన్ని కూడా కాంగ్రెస్ పెద్దలు వాడుకోబోతున్నారు. శరద్ పవార్,మమత బెనర్జీ, కరుణానిది లతో సంప్రదింపులు జరిపిన మీదట సోనియాగాంధీ ఈ అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. కాగా జనవరి లో కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి, అదే సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కూడా ఆహ్వానించి, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి ఎంతవరకు సిద్దంగా ఉన్నారన్నదానిపై కూడా చర్చించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!