రంగ‌నాథ్ ‘రెక్కలు’ పుస్తకావిష్కర‌ణ‌


ప్రముఖ న‌టుడు, ద‌ర్శకుడు, క‌వి రంగ‌నాథ్ ర‌చించిన ‘ప‌ద‌ప‌రిమ‌ళం’ రెక్కల పుస్తకావిష్కర‌ణ డిసెంబ‌ర్ 18 ఆదివారం రోజు సాయంత్రం అట్టహాసంగా జ‌రిగింది. హైద‌రాబాద్ సిటీసెంట్రల్ లైబ్రరీలో జ‌రిగిన ఈ కార్యక్రమం ఐఎఎస్ అధికారి శ్రీ‌ కె.వి. ర‌మణాచారి అధ్యక్షత‌న‌లో జ‌రిగింది. రంగ‌నాథ్ గారు ర‌చించిన ‘రెక్కలు’ పై వ‌క్తలు త‌మ అభిప్రాయాల‌ని తెలిపారు. మ‌నిషి జీవితాన్ని ఆవిష్కరించే క‌విత్వం రంగ‌నాథ్ గారి సొంతం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క‌వి ‘భార‌త్‌భాషా భూష‌ణ్’ శ్రీ తిరున‌గ‌రి, నేటినిజం పత్రికా సంపాద‌కులు శ్రీ బైస దేవదాస్‌, ‘ఆచార్య’ మ‌స‌న చెన్నప్ప, ప్రముఖ ర‌చ‌యిత్రి కేత‌వ‌ర‌పు రాజ్యశ్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు. కాగా ఈ గ్రంధాన్ని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత శ్రీ స‌లీంగారు ఆవిష్కరించ‌గా డా ధ‌ర్మపురి మ‌ధుసూధ‌న్ దంప‌త‌ల‌కి ఈ గ్రంధాన్ని అంకితం చేశారు. సినీ న‌టులంద‌రూ రాజ‌కీయాల్లోకి వెళుతుంటే రంగ‌నాథ్ గారి సాహిత్యలోకంలోకి ప్రవేశించ‌డం ఎంతో సంతోష‌మ‌ని చెన్నప్పగారు వ్యాఖ్యానించారు. వ‌క్తలంద‌రూ రంగ‌నాథ్ గారి క‌విత్వాల‌ని కొనియాడారు. కాగా ఈ కార్యక్రమంలో 5ఎఎంన్యూస్ డాట్ కామ్ ఎడిట‌ర్ సంతోష్‌కృష్ణ పాల్గొని రంగ‌నాథ్ గారికి శుభాకాంక్షలు తెలియ‌జేసారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!