నిరాశలో చిరంజీవి వర్గం
కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్ నేత అజిత్ సింగ్ కు స్థానం కల్పించి,ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ప్రస్తుతానికి మొండి చూపడం సహజంగానే ఆయన అభిమానులలో నిరాశ మిగిల్చింది. దీనిపై చిరంజీవి కాస్త అసంతృప్తి చెందారని అంటున్నారు. కాగా తమకు ఇప్పుడు మంత్రి పదవి రాదని ముందే తెలుసునని ప్రజారాజ్యం వర్గాలు చెబుతున్నాయి.పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఈ విషయమై అదికారికంగా ప్రకటించారని, ఫిబ్రవరిలో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయన తెలిపారని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.అదే సమయంలో అజిత్ సింగ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే సమయంలో చిరంజీవికి ఇవ్వకపోవడం తమ నేతకు కాస్త ఇబ్బందికరమేనని ప్రజారాజ్యం వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.దీనిపై చిరంజీవి తన వర్గం నేతలు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులతో చర్చించారని, ఆ మీదట వారిద్దరూ బొత్సతో బేటీ అయ్యారని, అనంతరం బొత్స జూబ్లిహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి అనునయించారని కధనాలు వస్తున్నాయి. కాగా అనర్తత వేటుకు గురయ్యే పదహేడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు తమ వర్గానికి నాలుగు స్థానాలు కేటాయించాలని కోరుతున్నారట. వాటిలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, కడప జిల్లా రాజంపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నాయని చెబుతున్నారు. తోట త్రిమూర్తులు, కొత్తపల్లి సుబ్బారాయుడు, గునిపాటి రామయ్య, పి. ఆనంద్ లను ఈ స్థానాలలో నిలపాలని చిరంజీవి ప్రతిపాదిస్తున్నారు. అయితే ముందుగా అనర్హత వ్యవహారం తేలి ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో చూడవచ్చన్నది కాంగ్రెస్ వర్గాల వ్యాఖ్యగా ఉంది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి