ఉపెన్నిక‌ల‌కి ఇప్పటినుండే..


తెలుగుదేశం పార్టీ ఈ మద్య కాలంలో పుంజుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. రాజకీయాలలో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండడం ద్వారానే ప్రజలలో ముందుకు వెళ్లగలమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఉప ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తోంది. హైదరాబాద్ నగరంలోని ఒక డివిజన్ లో టిడిపి గెలుపొందిన సమయంలో, అలాగే బాన్స్ వాడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ముప్పైమూడు వేలకు పైగా ఓట్లు వచ్చిన నేపద్యంలో ఇకపై ప్రతి ఉప ఎన్నికలోను పోటీచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం ఏడు శాసనసభ నియోజకవర్గాల ప్రతినిధుల రాజీనామాలు ఆమోదం పొంది ఆ సీట్లు ఖాళీ అయితే, మరో పదిహేడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అనర్హులైతే అప్పుడు అవి ఖాళీ అవుతాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఖాళీగా ఉన్న సీట్లతోపాటు, ఖాళీ అవడానికి అవకాశం ఉన్న మిగిలిన సీట్లకు కూడా అభ్యర్దులను ఎంపిక చేసే ప్రక్రియ ఆరంభించి క్యాడరును, పార్టీ నాయకులను బిజీగా ఉంచుతున్నారు. ఆయా జిల్లాల నుంచి నాయకులను, ముఖ్య కార్యకర్తలను పిలిపించి మాట్లాడడం, అభ్యర్దుల ఎంపికపై చర్చించడం, ఆ సందర్భంగా ఒక సందేశం ఇవ్వడం అదంతా
మీడియాలో రావడం ద్వారా పార్టీని గతంలోకన్నా చైతన్యం చేశారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా అందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మాజీ పోలీసు అధికారి నరసయ్యకు లేదా ఆయన కుమారుడుకు టిక్కెట్ ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.నరసయ్య చాలాకాలం దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు భద్రత అధికారిగా పనిచేశారు. ఆయన గత ఎన్నికల సమయంలోనే టిక్కెట్ ఆశించారు కాని లభించలేదు. ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే కనుక అనర్హ త వేటుకు గురి అయితే ఉప ఎన్నిక వస్తుంది. అందువల్ల జరిగే ఉప ఎన్నికకు నరసయ్యను లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఆయన కుమారుడిని సిద్దం కావాలని చంద్రబాబు సూచించారట. అలాగే ఆయా చోట్ల అభ్యర్దులను ఖరారు చేస్తూ పార్టీని మళ్లీ పట్టాలు ఎక్కించే కృషిలో చంద్రబాబు పడ్డారని అంటున్నారు. మరి ఇది ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!