ఊపిరి పీల్చుకున్న స్టాక్‌మార్కెట్‌


చాలా రోజుల తర్వాత ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ ఏక కాలంలో కళకళలాడుతున్నాయి. అన్ని మార్కెట్ల కంటే అమెరికా మార్కెట్లు ఎక్కువగా లాభపడ్డాయి. డౌజోన్స్‌ సూచీ ఏకంగా 337 పాయింట్లు పెరిగి 12,103 పాయింట్ల వద్ద ముగిసింది. గడిచిన నెల రోజుల్లో డౌజోన్స్‌ ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. నాస్‌డాక్‌ కూడా 3 శాతానికి పైగా పెరిగింది. 2,603 పాయింట్ల వద్ద ముగిసింది.
యూరోప్‌లో జర్మనీ, ఫ్రాన్స్‌ సూచీలు రెండున్నర నుంచి మూడు శాతం దాకా పెరిగాయి. ఆసియా మార్కెట్లలో తైవాన్‌ సూచీ దుమ్ము రేపుతోంది. ఏకంగా 4 శాతం లాభపడుతోంది. ఆసియాలో మిగిలిన ప్రధాన సూచీలు కూడా ఒకటిన్నర శాతం దాకా పెరుగుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టీ 80 పాయింట్లకు పైగా పెరుగుతూ 4,650 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!