అణు భ‌ద్రత‌పై పాక్‌, భార‌త్ దృష్టి


ద్వైపాక్షిక సంబంధాలు, అణుభద్రతలే ప్రధాన ఎజెండాగా భారత్‌ పాకిస్తాన్‌ దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో చర్చలు సాగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిం చేందుకు ఐదో దఫాగా, అణుభద్రత విషయంలో ఆరోదఫాగా నిపుణుల స్థాయి చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల్లో ఈ సమావేశం జరపాలని నిర్ణయించారు.
అణుభద్రతపై ఇంత విస్తృత స్థాయిలో చర్చలు జరగడం నాలుగేళ్ళలో ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటుచేసుకున్న సందర్భాలతో పాటు ఉగ్రవాద దాడులు పెచ్చుమీరినప్పుడు ఇరు దేశాల్లోని అణ్వాయుధాలకు, అణుకర్మాగారాలకు ఎటువంటి భద్రత కల్పించాలి, సమాచారాన్ని పరస్పరం ఎలా ఇచ్చిపుచ్చుకోవాలన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోను ముందుగా అణ్వస్త్ర దాడి చేసే ప్రసక్తేలేదని ఇరు దేశాలు గతంలోనే ప్రకటించాయి. పైగా ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో పాకిస్తాన్‌ భారత్‌కు అత్యంత ప్రాధాన్యతా దేశ హోదానిస్తూ తీర్మానం చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!