చిరుని అడ్డం పెట్టుకుని..


మెగాస్టార్ చిరంజీవిని అడ్డంపెట్టుకుని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజకీయం చేస్తున్నారా? ఇందులో ఎంత వాస్తవం ముందో తెలియదు కాని ముఖ్యమంత్రి శిబిరం మాత్రం అదే ప్రకారం అభిప్రాయంతో ఉంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా చిరంజీవి కాస్త భిన్న ధోరణి అవలంభించడం, ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు కాస్త బెట్టు చేయడం తదితర అంశాల వెనుక బొత్స ప్రమేయం కూడా ఉందన్నది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితుల వాదనగా ఉంది. అలాగే కాంగ్రెస్ అధిష్టానం వద్ద చిరంజీవి పట్ల సానుకూల వైఖరిని కూడా బొత్స ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాడుకొటున్నారన్న అనుమానం కూడా వీరిలో ఉంది. అందుకే వారు బొత్స కు వ్యతిరేకంగా అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు ఒక మాట చెబుతున్నారు బొత్స సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవి భుజంపై తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నారు.. ఆ విషయాలను తాము గమనించకపోలేదు అని వ్యాఖ్యానిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!