ప్రయోగాత్మకంగా ‘ప్రయోగం’


ప్రపంచంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు వ‌చ్చాయి, స‌క్సెస్ సాధించాయి.. స‌రిగ్గా అలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తెలుగు తెర‌పై తీసుకువ‌స్తున్నాడు యువ ద‌ర్శకుడు భానుప్రకాష్‌. సూర్య ప్రధాన పాత్రలో భానుప్రకాష్ ద‌ర్శక‌త్వంలో ర‌త్తమ్మ బ‌లుసు నిర్మిస్తున్న చిత్రం ప్రయోగం. ఈ చిత్రంలో యువ ద‌ర్శకుడు చేసిన ప్రయోగం ఏమిటంటే.. ఈ చిత్రం నిడివి రెండు గంట‌లా ఇర‌వై నిముషాల‌పాటు కొన‌సాగితే.. రెండు గంట‌ల పాటు మాత్రం ఈ చిత్రం థియేట‌ర్ స్క్రీన్‌పై నాలుగు ఫ్రేముల‌లో నాలుగు సీన్‌లు క‌నిపిస్తుంటాయి.. అంత‌ర్లీనంగా ఈ నాలుగు ఫ్రేముల‌లో వ‌చ్చే సీన్‌ల‌కి సంబంధాలుంటాయి. ఇటువంటి ప్రయోగం ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేద‌ని చెప్పాలి..? అయితే నాలుగు ఫ్రేముల‌లో క‌నిపించే సీన్‌లు ఆ నాలుగు ఫ్రేమ్‌ల‌లో క‌నిపించే పాత్రల‌కి సంబంధం ఉండ‌టంతో ప్రేక్షకుడు చాలా సుల‌భంగా ఈ నాలుగు ఫ్రేముల‌లో క‌నిపించే సీన్లని చూసేందుకు వీల‌వుతుంద‌ని ద‌ర్శకుడు భానుప్రకాష్ అన్నారు. ఈ చిత్రంలో చేసిన ఈ ప్రయోగం స‌క్సెస్ అయితే యువ ద‌ర్శకుడు భానుప్రకాష్ పేరు మారుమ్రోగిపోతుంద‌ని చెప్పడంలో ఆశ్చర్యం లేదు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!