ప్రివ్యూ : య‌థార్థక‌థ‌తో ‘రాజ‌న్న’


స్వతంత్య్ర పోరాటంలో జరిగిన యధార్థ సంఘటనలు ఆధారం చేసుకొని తీర్చిదిద్దిన కథే ‘రాజన్న’. ఈ  చిత్రం అన్ని హంగులతో ఈ నెల 22న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్దమ‌య్యింది..  రాజ‌న్న చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తండ్రి ప్రముఖ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్రసాద్ ద‌ర్శక‌త్వం వ‌హించ‌డం, ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌ని త‌న‌దైన శైలిలో రాజ‌మౌళి తెర‌కెక్కించ‌డం, అక్కినేని నాగార్జున రాజ‌న్నగా ఓ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోదుడి పాత్రలో న‌టించ‌డం ఈ చిత్రానికి విప‌రీత‌మైన అంచ‌నాల‌ని తెచ్చిపెట్టాయ‌. ఈ అంచ‌నాల‌కు త‌గ్గట్టుగానే నాగార్జున ఈ చిత్రం ఖ‌చ్ఛితంగా విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. ఈ చిత్రంలో మ‌రో ప్రత్యేకత ఏమిటంటే..  సీనియర్ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు గారు తన గొంతును వినిపించినట్లు సమాచారం.చిత్రం మొదలయ్యే సమయంలోని కొన్ని కీలక సన్నివేశాలకు ఏఎన్నార్ గారు తన వాయిస్ ఓవర్ అందించారు. రాజన్న చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున గారే స్వయంగా నిర్మించడం జరిగింది. రాజన్న చిత్రం నాగార్జున గారి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే మార్కెట్లో విడుదలై విశేష ఆదరణ లభించింది. విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం అందించగా స్నేహ నాగార్జున భార్యగా నటిస్తుంది. ఏనీ అనే పాప రాజన్న కూతురిగా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ..  ”కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న నేను.. ఈ కథపై మక్కువతో నిర్మాణానికి పూనుకున్నాను. దర్శకుడు విజయేంద్రప్రసాద్ అద్భుతంగా నా పాత్రను మలిచారు. రాజమౌళి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుందీ సినిమా’’ అని అన్నారు. భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న రాజ‌న్న చిత్రం ఎక్స్‌క్లూజివ్ రివ్యూ డిసెంబ‌ర్ 22 మ‌ధ్యాహ్నం క‌ల్లా మీ ముందుంచుతుంది 5ఎఎంన్యూస్ డాట్ కామ్‌.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!