చిరుకి షాక్ ఇచ్చిన పీఆర్పీ తొలి అభ్యర్థి


చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించ‌గానే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యే ప‌ద‌వికి ఎంపిక చేసిన మొట్ట మొద‌టి అభ్యర్థి మునెమ్మ. అప్పట్టో చిరంజీవిపై అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరింది. ఆమె చేసిన ఉప‌న్యాసం ఆక‌ట్టు కోవ‌డంతో చిరంజీవి అప్పటిక‌ప్పుడు త‌మ పార్టీ త‌ర‌పున మొట్ట మొద‌టి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె పేరుని ప్రక‌టించారు. అయితే అప్పట్లో ఆమె ఓడిపోయింది. ఆమెని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రక‌టించిన‌ప్పటికీ ఎన్నిక‌ల ప్రచారంలో ఆమె త‌ర‌పున మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ ప్రచారం చేయ‌లేద‌నే విమ‌ర్శలు అప్పట్లో వినిపించాయి. తాజా ప‌రిణామాల‌తో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో మునెమ్మ కూడా పీఆర్పీని వీడింది. ఆమె ప్రజారాజ్యం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరింది. పీఆర్పీ త‌ర‌పున మొట్ట మొద‌టి అభ్యర్థిగా ఎన్నికైన ఆమె పార్టీ మారడం ప్రాధాన్యత‌ని సంత‌రించుకుంది. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కాగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తనని జగన్ వైపు నడిపించాయని మునెమ్మ చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!