హైకోర్టు జ‌డ్జిపై ‘సాక్షి’ ఆరోప‌ణ‌లు


క్రిమినల్ కేసు ఉన్నప్పట్టికీ ఆ విషయం తెలియ చేయకుండా న్యాయమూర్తి పదవిని చేపట్టారంటూ ఒక జడ్జిపై సాక్షి సంచలనాత్మక కధనాన్ని ఇచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ వ్యక్తి తొలి నుంచి సన్నిహితుడని, హైకోర్టులో చంద్రబాబు తరపున ఆయన వ్యవహారాలు చక్కబెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించింది.సాక్షి మొదటి పేజీలో ప్రచురించిన ఈ కధనంలో జడ్జి పేరు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ఆందోళనలో బస్ లపై రాళ్లు రువ్విన కేసులో రవి మారుతి అనే వ్యక్తితోపాటు ఇతరులపై పెట్టిన కేసును ఉపసంహరించు కుంటున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం జి.ఓ రెండువేల ఒకటిలో ఇచ్చింది. ఆ కేసులో రవి మారుతి మూడో నిందితుడు అయితే జడ్జి అయిన వ్యక్తి నాలుగో నిందితుడని సాక్షి వెల్లడించింది. ఈ న్యాయమూర్తి సుప్రింకోర్టు జడ్జి కూడా అయ్యే అవకాశం ఉందని తెలిపింది.తనపై క్రిమినల్ కేసు ఉన్నట్లు జడ్జి అయిన వ్యక్తికాని, రాష్ట్ర ప్రభుత్వం కాని సుప్రింకోర్టుకు , కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ఉంటే ఆ నియామకం జరిగేదే కాదని ఈ పత్రిక వ్యాఖ్యానించింది.వాస్తవాలను మరుగున పెట్టి న్యాయమూర్తి అయ్యారని, ఆ తర్వాత కొంతకాలానికి కేసును ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు జిఓ ఇచ్చిందన్నది ఈ కధన సారాంశం. సంచలనం రేకెత్తిస్తున్న ఈ కధనంతో ఆ జడ్జి ఇరుకున పడతారా? అలాగే చంద్రబాబు నాయుడు కూడా దీనిపై వివరణ ఇవ్వవలసి ఉంటుందా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!