నరకలోకం ఉన్నదా? (పార్ట్ 2)


నరకలోక వర్ణన

నరకలోకం గురించి మన పురాణాల్లో సుదీర్ఘ వివరణే ఉంది. ఇతర మతాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. ఇక్కడ భూమిమీద పాపాలు చేసేవారికి దేహానంతరం, నరకలోకంలో శిక్షలు తప్పవని దాదాపు అన్ని మతాల వారు విశ్వసిస్తున్నారు.
నరకలోక వర్ణన గరుడపురాణంలో చాలా విశిదంగానే ఉంది. మనిషి మరణించిన తరువాత చేసిన పాపాలకు తగ్గట్టుగా నరకానికి వెళతాడన్న నమ్మకం హిందూ మతంలోనేకాదు, అనేక మతాల్లో కూడా ఉంది. నరకంలోకంలో అగ్నిజ్వాలలు ఎగిసిపడుతుంటాయి.  ఆ మంటల్లో పాపులు పడిపోతుంటారు. వారి ఆర్తనాదాలు వినబడుతుంటాయి.
వైతరణి నది అత్యంత భయానకంగా ఉంటుందని కూడా మన పురాణాలు చెబ్తున్నాయి. ఈ నదిలోనుంచి వెళ్లేటప్పుడు కలిగే బాధతో ఆత్మలు ఘోషిస్తాయి.  చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. ఈ నది కొన్ని వేల మైళ్ళా వెడల్పు కలిగి ఉంటుందట. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము,చీము,ఎముకలు, బురదలా కనిపించే మాంసఖండాలుంటాయని కూడా  గరుడ పురాణం చెబ్తోంది.
నరక ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో బైబుల్ లో కూడా ప్రస్తావన ఉంది. సూక్ష్మ శరీరం భవబంధనాలను తెంచుకోలేక ప్రారంభంలో నిదానంగా వెళుతుంటుంది. చేసిన పాపాలు స్వర్గంలోకి తీసుకువెళ్లకుండా నరకంలోకి తోసేస్తాయి. చేసిన పాపాల నుంచి ఎవ్వరూ రక్షించలేరు. అంధకారంలోకి తోసివేయబడతారు. శరీరం మలమలా మాడిపోతుంది. దారితెన్నూలేని పయణం….రాకాసి నోట్లో పడుతున్న భావన…పాపకర్మల ఫలితాన్ని అనుభవించిన తరువాతనే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. మహాభాగవతంలో దేహం అనుభవించే నరక శిక్షల ప్రకారం మొత్తం 28 నరకాలు ఉన్నట్టు తేల్చి చెప్పారు. వాటిలోనే రౌరవము, మహా రౌరవము, అంధకూపం, క్రిమి భోజనం వంటివి కూడా ఉన్నాయి. క్రైస్తవ మతంలో కూడా నరక వర్ణన ఉంది. నరకలోకంలో అగ్ని ఆరదనీ, పురుగు చావదని చెప్పారు. ఇస్లాం మతం ప్రకారం, నరకలోకంలో ఏడు ద్వారాలుంటాయి. దాహమేసి నీరు అడిగితే సలసలాకాగే నీరూ చీము నెత్తురూ ఇస్తారట. హృదయాలను దహించే అగ్నిజ్వాలలుంటాయక్కడ.  గ్రీకు పురాణంలో కూడా నరక వర్ణన ఉంది. వీళ్ల నమ్మకం ప్రకారం, ప్లూటోనే నరకలోకానికి రాజు.
(ఇంకా ఉంది)
- తుర్లపాటి నాగభూషణ రావు
9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!