స‌మ్మెకూ, ప‌వ‌ర్ కోత‌కూ ఇంకా లింకా..?


విద్యుత్ కొరతకు, సకల జనుల సమ్మెకు ఇంకా లింకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోతలు జనాన్ని వేధిస్తున్నాయి. ఇక ముందు కూడా ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది గంటలవరకు ఉన్న కరెంటుకోత అది ఆరు నుంచి పన్నెండు గంటల వరకు పెరుగుతుంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవలికాలంలో లేని విదంగా కరెంటు కోత వేధిస్తోంది. దీని ఫలితంగా పారిశ్రామిక రంగంపై కూడా గణనీయంగా పడుతోంది.ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోజరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సకల జనుల సమ్మె ప్రభావం ఇంకా ఉందని, దీనివల్లనే కరెంటు కోత పెట్టవలసి వస్తున్నదని చెప్పారు.సకల జనుల సమ్మె ముగిసి నెల రోజులు దాటిపోయినా, ఇంకా ఆ కారణం వల్లనే విద్యుత్ కోత అనడం ఎంతవరకు సమంజసమో తెలియదు. వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదు. ఏది ఏమైనా కరెంటు కోత వల్ల రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడుతుందని చెప్పకతప్పదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!