కేరళ మరో ఆలయంలో అపార సంపద



ఈ ఏడాది మొదట్లో కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో అపార సంపద బయటపడింది. ఇప్పుడు ఏడాది చివర్లో అలాంటి ఆలయమే మరోకటి ఉన్నదన్న రూమర్స్ బాగా వినబడుతున్నాయి. తిరువిల్లామలలోని 400 ఏళ్లనాటి స్వామి విల్వాద్రినాధ ఆలయంలో ఆపార సంపద ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో అక్కడ కూడా కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటుచేశారు. ఎర్నాకులం, పాల్కాడ్, త్రిసూర్ జిల్లాల్లో సంపద ఉన్నాయని భావిస్తున్న ఆలయాలు 400 దాకా ఉన్నాయట. ఫ్రెంచివాళ్లు వర్తకం కోసం వచ్చినప్పటి నుంచీ, బ్రిటీష్ కాలం వరకు అనేక ఆలయాల్లో అత్యంత విలువైన సంపదను దాచారని చెప్పుకుంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!