ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు! (పార్ట్ 3)


వీపీ సింగ్ హయాంలోనూ, దేవెగౌడ పాలనలోనూ సీను మారలేదు. లోక్ పాల్ బిల్లు ముట్టుకోగానే రాజకీయ సంక్షోభంతో పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బిల్లూకీ, సంక్షోభాలకీ ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, లోక్ పాల్ బిల్లు అనగానే ఢీల్లీ పెద్దల్లో వణుకు పుట్టుకొస్తూనే ఉంది.
కేంద్రంలో పాలన విషయానికి వస్తే, 1989కి ఓ ప్రత్యేకత ఉంది. ఆ సంవత్సరమే కేంద్రంలో  రెండోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బోఫోర్స్ కుంభకోణంపై ఎదురొడ్డిపోరాడిన వీపీ సింగ్ , నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రధాని అయ్యారు. ప్రధాని కాగానే ఆయన చూపు లోక్ పాల్ బిల్లుపైనే పడింది. అవినీతిని ఎండగొట్టే సాధనంగా ఈ బిల్లు పనిచేస్తుందని వీపీ సింగ్ నమ్మేవారు. ఆయన చూపిన చొరవతో బిల్లు ఐదోసారి పార్లమెంట్ లోకి ప్రవేశించింది. లోక్ పాల్ యంత్రాంగం కోసం భారీ బడ్జెట్ కేటాయించాలని కూడా అనుకున్నారు. ఇక బిల్లుకు చట్టబద్ధత రావడమే తరువాయన్న సమయంలో రాజకీయ సంక్షోభం వచ్చేసింది. సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో  వీపీ సింగ్ సర్కార్ కూలిపోయింది. ఫలితంగా మరోసారి  లోక్ పాల్ బిల్లు అటకెక్కింది.
లోక్ పాల్ బిల్లు అనగానే  పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. బహుశా ఈ కారణంగానే కావచ్చు, లేదా మరేకారణాలవల్లనో కావచ్చు, పీవీ నరసింహారావు ప్రధాని బాధ్యతలు చేపట్టినా ఈ బిల్లు జోలికి పోలేదు.
1996లో తృతీయ ఫ్రంట్ తరఫున దేవెగౌడ ప్రధాని అయినతరువాత  లోక్ పాల్ బిల్లు మరోసారి వెలుగుచూసింది. కానీ, అది గట్టెక్కేలోపే దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది.
దేవెగౌడ తరువాత ప్రధాని అయిన ఐ.కె.గుజ్రాల్ ఈ కీలకమైన బిల్లు గురించి ఆలోచించే తీరిక కుదిరేలోపే ఆయన గద్దెదిగేశారు.
లోక్ పాల్ బిల్లే అవినీతిని ఎదుర్కునే ఏకైక అస్త్రంగా భావించిన ఎన్డీయే ఏం చేసింది, చివరకు ఏన్డీయే ప్రభుత్వం పరిస్థితి ఏమైంది?  ఆ వివరాలు 4వ భాగంలో …
- తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!