తెలంగాణకు వ్యతిరేకం కాదు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సత్తా వ్యతిరేకం కాదని, ప్రత్యేక రాష్ట్రాన్ని పూర్తిగా స్వాగతిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 610 జీవో అమలు కావడం లేదని, 14ఎఫ్‌ను పూర్తిగా తొలగించాలని ముందుగా గొంతెత్తింది లోక్‌సత్తా పార్టీయేనని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలు అధికార క్రీడలో భాగంగా తెలంగాణ ప్రజలను ఉపయోగించుకున్నాయని విమర్శిం చారు.  తెలంగాణపై తమను ఎవరూ నిర్ణయం చెప్పమనలేదని, ఎప్పుడూ సమావేశాలకు కూడా పిలవలేదన్నారు. వచ్చే ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో లోక్‌సత్తా అభ్యర్థులు పోటీ చేస్తారని జేపీ ప్రకటించారు. కాగా, తక్కువ ఖర్చుతో, త్వరలో ప్రాజెక్టు నిర్మాణం చేసే వారికే పోలవరం టెండర్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తట్ట మన్ను ఎత్తలేదు, నీళ్లు లేవు.. అయినా కాంట్రాక్టర్లకు వెయ్యి కోట్లు చెల్లించారని, అధికార, ప్రతిపక్షాలు కుమ్మకై నోరుమెదపడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!