అప్పనంగా 5వేల కోట్లు..


మద్యం సిండికే్ట్ల కుంభకోణం కాంగ్రెస్ రాజకీయా లలో ఒక సంచలనంగా మారింది. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కొంతకాలం క్రితం ఒక సర్వే జరిపారని, దాని ప్రకారం మద్యం అమ్మకాలలో ఎమ్.ఆర్.పి అంటే గరిష్ట చిల్లర ధర ను మించి అమ్ముతున్న ఫలితంగా ఏడాదిన్నర కాలంలో సుమారు ఐదు వేల కోట్ల మేర అక్రమ ఆర్జనకు మద్యం సిండికేట్లు పాల్పడ్డాయని ఈ సర్వేలో తేలిందని కధనాలు వస్తున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ ఉల్లంఘనల విలువ సుమారు పన్నెండు వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆ ప్రాంతంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సంబంధించినవారికి సిండికేట్లలో అత్యధికంగా వాటా ఉందన్న ప్రచారం తెలిసిన సంగతే. ఈ నేపధ్యంలోనే ఎసిబితో దాడులు చేయించారని చెబుతున్నారు. నిజానికి ఎక్సైజ్ ఎన్ఫ్ ఫోర్స్ మెంట్ విబాగం చేయవలసిన పనిని ఎసిబి తో చేయించడం వెనుక , విషయం రహస్యంగా ఉంచాలన్న లక్ష్యమే కావచ్చని చెబుతున్నారు. అయితే ఎసిబి తన పరిధిలో లేని వ్యవహరాన్ని నడపడం వల్ల దీనిపై కేసులు పెట్టడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది తెలియదు. అయితే రాజకీయంగా ఎసిబి నివేదికను వాడుకోవచ్చు.ఇప్పుడు జరుగుతున్నది అదేనని అంటున్నారు.రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని సుమారు 900 ఫాపు లలో మధ్యం కొనుగోలు చేసి ఎమ్.ఆర్.పి ధర కన్నా ఎంతకు ఎక్కువకు మద్యం అమ్ముతున్నారో లెక్కించి సగటు విలువ లెక్కవేస్తే ఐదు వేల కోట్లకు పైగా అక్రమ సంపాదన ఉన్నట్లు లెక్కించారట. అదీ సంగతి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!