సామాన్యుడికి ‘విద్యుత్’ షాక్‌



సామాన్యుడి నడ్డి విరిచే విదంగా విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇందుకు సంబందించిన ప్రతిపాదనలను అధికారులు సిద్దం చేశారు. ఇక ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి.నూతన సంవత్సర కానుకగా విద్యుత్ ఛార్జీలు పెరగబో తున్నట్లు విస్తారంగా కధనాఉ వస్తున్నాయి. ఏభై యూనిట్ల వరకు ఛార్జీలు పెంపుదల ఉండకపోవచ్చు. ఏభై యూనిట్ల వినియోగం మించిన తర్వాత నుంచి మూడు వందల యూనిట్ల వరకు నలభై పైసల చొప్పున యూనిట్ కు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు.ప్రస్తుతం ఏభై నుంచి వంద యూనిట్ల వరకు రేటు యూనిట్ కు రెండు రూపాయల ఎనభై పైసలు ఉండగా అది మూడురూపాయల ఇరవై పైసలు చేయాలసి సంకల్పించారు.వంద నుంచి రెండు వందల యూనిట్ల వినియోగం ఉన్న వారు మూడురూపాయల ఐదు పైసల నుంచి మూడున్నర రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రెండు వందల యూనిట్ల నుంచి మూడు వందల యూనిట్లకు యూనిట్ ధర 4.75 రూపాయల నుంచి ఐదు రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు.ఆ పైన మాత్రం రేటు పెంచకపోవడం విశేషం. హెచ్.టి .రంగంలో ధరలు పెంచాలని సంకల్పించారు. మొత్తం మీద ఆరువేల కోట్ల రూపాయల భారం వేయాలని తలపెట్టారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!