ఎఫ్‌డిఐల‌పై ప్రణ‌బ్ ప్రక‌ట‌న‌


పార్లమెంట్ లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. విపక్ష, భాగస్వామ్య పక్షాల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్న నేపథ్యంలో ఎఫ్ డీఐలపై కేంద్రం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఏకాభిప్రాయం కుదిరేవరకూ ఎఫ్ డీఐలపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దాంతో పార్లమెంటును నిర్వహించేందుకు అఖిలపక్షం అంగీకారం తెలిపింది. ఎఫ్ డీఐలపై అనుమతిని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం లోక్ సభలో ప్రకటన చేయనున్నారు. అలాగే రాజ్యసభలో ఆనంద్ శర్మ ప్రకటన చేస్తారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు తమ విజయంగా అభివర్ణించాయి.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!