కొల ‘వెర్రి’ కోటిన్నర దాటింది..


రజనీకాంత్ అల్లుడు ధనుస్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రాబోతున్న ‘3’ సినిమాకుగాను ‘కొలవెరి’ అనే పాటను రాసి, దాన్ని స్వయంగా పాడిన విషయం తెలిసిందే. సూపర్ పాపులర్ అయిన ఈ సాంగు అతితక్కువ కాలంలో కోటిన్నరకు పైగా క్లిక్స్ తో మోస్ట్ వ్యూవుడ్(గోల్డ్) లిస్టులో చేరింది. భారతీయ సినీ చరిత్రలో ఓ సినిమా పాట, అందులోనూ హీరో పాడిన దానికి ఇంత పెద్ద మొత్తంలో హిట్స్ రావడం బహుషా ఇదే తొలి సారి కాబోలు.
ఈ పాటలో ఉన్న మహత్యం ఏమోగానీ….దేశ వ్యాప్తంగా ఈ పాటకు వెర్రిక్కిన వాళ్లలా అభిమానులైపోయారు చాలా మంది. అందుకే మీడియాలో ఈ పాటను కొల ‘వెర్రి’గా అభివర్ణిస్తున్నారు. ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడంతో ‘3’ సినిమా విజయంవంతం అవడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. సినిమా ఎలా ఉన్నా… ఆ పాట కోసం అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారంతా..

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!