జ `గన్' పేలితే రాలే ఓట్లు...?
రాష్ట్రంలో రోజురోజుకీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. నిన్నమొన్నటిదాకా ప్రతిపక్షనేతగా ఉన్న కొణిదెల శివశంకర వరప్రసాద్...అదేనండీ...మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దర్జాగా కాంగ్రెస్ కు సలామ్ కొట్టేశాడు. మరో పక్క నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్ ఎంపీగా చలామణి అయిన జగన్మోహన్ రెడ్డి (జగన్) కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి సొంతపార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే, ఈ రెండూ చాలా ముఖ్యమైన రాజకీయ పరిణామాలే. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల దాని ప్రభావం జగన్ మీద ఏమేరకు ఉంటుందన్నది ఇప్పుడు తలెత్తిన ప్రశ్న. జగన్ వర్గీయులు మాత్రం, చిరు ప్రభావం జగన్ మీద ఉండదనే అంటున్నారు. అయితే, రాజకీయ సర్వేలు మాత్రం సుమారు ఆరుశాతం వరకు ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇక రెండో కీలక అశం. రెడ్డి ఓట్లు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే రెడ్డి ఓట్లు చీలిపోతాయా?ఇది మరో ప్రశ్న. మహాఅయితే, ఐదు శాతం ఓట్లు మాత్రమే చీలిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం... మీడియా ప్రభావం. ఈ మధ్యకాలంలో మీడియా తిమ్నిన...