జయలలిత రూటు ఎటు..?
తమిళనాడు ముఖ్యమంత్రి మళ్లీ రాజకీయాలలో ఒక వెలుగు వెలగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆమె బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందడంతో 2014 లో కేంద్రంలో అదికారంలోకి రావడానికి జయలలిత మద్దతు అవసరం అవుతుందని భావిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే అన్ని కూటములవారు జయతో రాజకీయ స్నేహం చేయడానికి ఉబలాటపడ్డారనిపిస్తుంది.వామపక్షాలకు, బిజెపికి మధ్య సంబంధాలు ఉప్పు,నిప్పుగా ఉంటాయని తెలుసు. కాని జయలలిత తమిళనాడులో తనతో కలిసి పోటీచేసిన వామపక్ష నేతలను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అలాగే తనకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడును కూడా పిలిచారు. ఇంతవరకు అయితే ఫర్వాలేదు.కాని చిత్రంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కూడా పిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే వామపక్షాలు ఏమనుకున్నాయో , ఏమోకాని వారు కూడా ఈ సందర్భం వరకు సరేలెమ్మని సరిపెట్టుకున్నాయి. మోడి అంటేనే అసలు పడని సిపిఐ నేతలు బర్దన్, రాజాలు నరేంద్ర మోడి సరసన కూర్చుని జయ ప్రమాణ స్వీకార వేడుకను తిలకించారు. అలాగే బిజెపి అధికారంలో ఉన్న రోజులలో నరేంద్ర మోడి అంశంలోనే చంద్రబాబుకు ...